301 రైళ్ల సమయాల్లో మార్పులు : రేపటినుంచే అమలు

14 Aug, 2018 08:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ రైల్వేశాఖరైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు చేసింది. ఉత్తరరైల్వేకు చెందిన పలు రైళ్ల బయలుదేరే సమయాలను ముందుకు మరికొన్ని రైళ్లలో డిపార్చర్‌ సమయాలను మార్చింది. ఆగస్టు 15 బుధవారం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఉత్తరరేల్వే  రైల్వే విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, 301 రైళ్ల సమయాలను మార్చారు. ఈ మార్పులు అయిదు నిమిషాలనుంచి రెండున్నర గంటల మధ్య  ఉంటుందని రైల్వే ప్రకటించింది. 

57 రైళ్ళలో బయలు దేరే సమయాలను ముందుకు జరిపింది. అలాగే 58 రైళ్లు గమ్యానికి చేరే సమయాన్ని పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అదేవిధంగా 102 రైళ్ల ఎరైవల్‌ సమాయాన్ని ముందుకు జరిపగా, మరో 84 రైళ్ళ బయలుదేరే సమయం పెరిగింది. ఉత్తర రైల్వే ఈ న్యూ టైం టేబుల్‌ను ప్రజలకు అందుబాటులోఉంచామని ఉత్తర రైల్వే  తెలిపింది. ఆగష్టు 15నుంచి అమలులోకి వస్తున‍్న ఈ మార్పులను ప్రజలు గమనించాలని కోరింది. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు రైల్వే ఎంక్వైరీ ద్వారా రైళ్ల రాకపోకల సమాచారాన్ని పొందాలని చెప్పింది.

అమృత్‌ సర్‌, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌, లక్నో మెయిల్, తేజాస్ ఎక్స్‌ప్రెస్, హమ్‌ సఫర్ ఎక్స్‌ప్రెస్, అంత్యోదయ తదితర రైళ్లు ప్రస్తుతం సమయంకంటే ఐదు నిమిషాల ముందు బయలుదేరతాయి. అలాగే నీలాచల్‌  ఎక్స్‌ప్రెస్, డెహ్రాడూన్‌-అమృతసర్‌, జన శతాబ్ది తదితర ఎక్స్‌ప్రెస్‌లు  ఆలస్యంగా గమ్యానికి చేరనున్నాయి.

>
మరిన్ని వార్తలు