‘ఆ నోట్లు నేపాల్‌లో చెల్లవు’

21 Jan, 2019 13:27 IST|Sakshi

ఖట్మండు : రూ వందకు పైబడిన భారత కరెన్సీ నోట్ల వాడకాన్ని నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ నిషేధించింది. రూ 2000, రూ 500, రూ 200 నోట్ల వాడకం చెల్లదని బ్యాంక్‌ పేర్కొంది. నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌ జారీ చేసిన ఉత్తర్వులు భారత పర్యాటకులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రూ 100కు మించిన భారత నోట్లతో కూడిన లావాదేవీలు, వాటిని కలిగిఉండటం, ట్రేడింగ్‌ చేయడం నిషేధిస్తూ నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌ అక్కడి ట్రావెల్‌ సంస్ధలు, బ్యాంకులు, ఆర్థిక సంస్ధలకు సర్క్యులర్‌ జారీ చేసిందని ఖట్మండు పోస్ట్‌ పేర్కొంది.

భారత్‌ మినమా మరే ప్రాంతానికి ఈ నోట్లను నేపాల్‌ పౌరులు తీసుకువెళ్లరాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల నుంచి భారత కరెన్సీని నేపాల్‌కు తీసుకురావడం నిషిద్ధమని తమ పౌరులకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. భారత్‌కు చెందిన రూ 100 అంతకు లోపు ఉన్న నోట్లను ట్రేడింగ్‌, మార్పిడికి అనుమతిస్తామని బ్యాంక్‌ తెలిపింది. కాగా నేపాల్‌ కేంద్ర బ్యాంక్‌ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ పర్యాటక రంగానికి ఇది తీవ్ర విఘాతమని ట్రావెల్‌ వ్యాపారులు, వాణిజ్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు