పంజాబ్‌ కింగ్స్‌ ఓనర్‌కు రెండేళ్ల జైలు

30 Apr, 2019 11:55 IST|Sakshi

టోక్యో : ఐపీఎల్‌ టీం పంజాబ్‌ కింగ్స్‌ యజమాని, పారిశ్రామికవేత్త నెస్‌ వాదియాకు జపాన్‌లో డ్రగ్స్‌తో పట్టుబడిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది మార్చిలో 25 గ్రాముల మత్తుపదార్ధాలను కలిగిఉన్న కేసులో నెస్‌వాదియాకు శిక్ష ఖరారైందని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ వెల్లడించింది.

కాగా, నెస్‌ వాదియా వాదియా గ్రూప్‌ అధినేత నుస్లీ వాదియా వారసుడు కావడం గమనార్హం. తాను కేవలం వ్యక్తిగత వాడకం కోసమే మత్తుపదార్ధాలను తన వద్ద ఉంచుకున్నానని మార్చిలో అరెస్ట్‌ అయిన సందర్భంలో నెస్‌ వాదియా అంగీకరించారు. కాగా నెస్‌ వాదియాకు జైలు శిక్షపై వాదియా గ్రూప్‌ ఇప్పటివరకూ స్పందించలేదు.

మరిన్ని వార్తలు