నెస్లీ కి మ్యాగీ తప్ప మరోదారి లేదా?

13 May, 2016 13:49 IST|Sakshi
నెస్లీ కి మ్యాగీ తప్ప మరోదారి లేదా?

 

మ్యాగీ  వివాదం  నెస్లీ ఇండియాను ఆర్థికంగా, నైతికంగా బాగా దెబ్బతీసింది.   మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్  ఉందని తేలడంతో  ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందుల్లో పడింది.   భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే  కంపెనీ  నష్టాల నుంచి బయట పడటానికి  వేరే మార్గం లేదా అంటే.. ఉందనే అంటున్నారు పెట్టుబడిదారులు.  మ్యాగీ ఉత్పత్తులపైనే కాక మిగతా వాటిపై కూడా దృష్టిసారించాలని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.

నెస్లీ తన అమ్మకాలను 70శాతం పెంచుకోవడానికి మ్యాగీ ఉత్పత్తులపై కాకుండా కంపెనీ ఆఫర్ చేసే మరో మూడు ఉత్పత్తులపై దృష్టిసారించాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాల ఉత్పత్తుల వాల్యుమ్, న్యూట్రిషన్ విభాగం కూడా వరుసగా నాలుగు ఏడాదులు నష్టాల్లో నడవడం, బెవరేజస్,చాకోలేట్ల అమ్మకాలు పతనం నుంచి బయటపడాలని భావిస్తున్నారు. ఈ ద్రవ్యోల్బణ వాతావరణంలో వాల్యుమ్ పైన కాకుండా కేవలం అమ్మకాలు, లాభాలపైనే దృష్టిసారించడంతో, కంపెనీకి ఈ నష్టాల వస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.

కొన్ని కేటగిరి ఉత్పత్తులో డిస్కౌంట్లు ఆఫర్ చేసి, అమ్మకాల వృద్ధిని పెంచుకోవడంలో నెస్లీ దూకుడులో ఉన్నప్పటికీ, ఇవి నిర్వహణ లాభాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదన్నారు. మార్చి క్వార్టర్లో మెటీరియల్ ఖర్చులు కూడా పెరిగాయన్నారు. పామ్ ఆయిల్ వంటి కమోడిటీల రేట్లను నెస్లీ పెంచింది. కంపెనీ ఆఫర్ చేసే ఉత్పత్తులపై రేట్లను తగ్గించుకుని, పట్టణ వినియోగాన్ని పెంచుకుంటే నెస్లీ లాభాలను ఆర్జించవచ్చని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అన్నీ కేటగిరీలోనూ వాల్యుమ్ వృద్దిని నెస్లీ చేపడితే లాభాలను నమోదుచేయొచ్చని చెబుతున్నారు. అమ్మకాలు, మార్జిన్లలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లలో కంపెనీపై ఆసక్తిని పెంచడానికి ఈ నష్టాలను నెస్లీ అధిగమించాల్సి ఉంది. మ్యాగీ ఉత్పత్తులు పునఃప్రారంభమయ్యాక కూడా నెస్లీ స్టాక్ 5.7శాతం కిందకే నమోదవుతోంది.   

మ్యాగీ ఉత్పత్తులు మార్కెట్లోకి పునఃప్రారంభమయ్యాక 50శాతం మార్కెట్ షేరును అవే నమోదుచేశాయని కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ అమ్మకాలు మార్చి క్వార్టర్లో గతేడాది ఇదే త్రైమాసికం కంటే 8.4శాతం పడిపోయాయని తెలిపింది. ఈ క్షీణత డిసెంబర్ త్రైమాసికంలో 24శాతం నెస్లీ అమ్మకాలు పతనం కంటే తక్కువే ఉందని తెలిపింది. ముందటి త్రైమాసికాలతో పోలిస్తే ఈ అమ్మకాల క్షీణత కొంత మెరుగుపడిందని కంపెనీ ప్రకటించింది.

మ్యాగీ మసాలా వేరియంట్ ను నవంబర్ లో కంపెనీ పునఃప్రారంభించింది. నిర్వహణ లాభాలు 3.5 శాతం పెరుగుతూ వస్తున్నాయని, కానీ ఇవి గతేడాది కంటే 1శాతం తక్కువగానే ఉన్నాయని పేర్కొంది. ఉద్యోగుల ప్రయోజనాలు, ఇతరాత్ర ఖర్చులు పెరగకపోవడం వల్ల ఈ లాభాలను ఆర్జిస్తున్నామని, అదేమాదిరి కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలు పెరగడం లేదని తెలిపింది.

మరిన్ని వార్తలు