రీచార్జ్‌ చేయకుంటే కనెక్షన్‌ కట్‌: నెట్‌ఫ్లిక్స్

22 May, 2020 18:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లాక్‌డౌన్‌ వేళ స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇంటర్నెట్‌ ఉంటే చాలు కావాల్సిన సినిమాలను వీక్షించవచ్చు. అయితే సినిమాలు చూడటానికి చాలా సైట్లు అందుబాటులో ఉన్నా.. నెట్‌ఫ్లిక్స్‌ సైట్‌ ప్రాచుర్యం పొందింది. థియేటర్లకు వెళ్లలేని వినియోగదారులకు ఈ సైట్ ‌అత్యుత్తమ ప్రమాణాలతో సేవలను అందిస్తుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ సైట్‌ కీలక ప్రకటన చేసింది. ఈ సైట్‌ను నెల లేదా సంవత్సర కాలానికి రీచార్జ్‌ చేసి.. వ్యాలిడిటీ అయిపోయాగానే వినియోగదారులు స్పందించడం లేదని సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. అధిక సంఖ్యలో వినియోగదారులు రీచార్జ్‌ చేయడం లేదని.. సైట్‌ను రీచార్జ్‌ చేయని వినియోగదారులు స్పందించకుంటే కనెక్షన్లను తీసివేస్తామని సంస్థ ప్రతినిథి యెడ్డీ వూ హెచ్చరించ్చారు.

రెండు సంవత్సరాలకు మించి సైట్‌ను వీక్షించని వినియోగదారుల కనెక్షన్లకు ఇదే నిబంధన వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. సంస్థ నియమాల వల్ల కేవలం ఒక శాతం వినియోగదారులు దూరం కావచ్చని యెడ్డీ వూ అభిప్రాయపడ్డారు. తాజా చర్యల వల్ల వినియోగదారలకు నెట్‌ఫ్లిక్స్‌పై మరింత నమ్మకం కలుగుతుందని సంస్థ ప్రతినిథులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సైట్‌లో కేవలం సినిమాలు మాత్రమే కాకుండా క్రికెట్‌, టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను వీక్షించేందుకు వినియోగదారులు ఇష్టపడుతున్నారు. యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లు ఉండడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఈ సైట్‌కు మొగ్గు చూపుతున్నారు.

చదవండి: శాంసంగ్‌ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కట్‌

మరిన్ని వార్తలు