ఏప్రిల్‌ 1 నుంచి కొత్త అకౌంటింగ్‌ ప్రమాణాలు

30 Mar, 2018 01:42 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత అకౌంటింగ్‌ నూతన ప్రమాణాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో భారత అకౌంటింగ్‌ స్టాండర్డ్‌ (ఇండ్‌ఏఎస్‌) 115 అమల్లోకి రానున్నట్టు కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రకటించింది. దీంతో కంపెనీలు తమ ఆదాయానికి సంబంధించి సమగ్ర వివరాలను నిర్వహించాల్సి వస్తుంది.

నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇండ్‌ఏఎస్‌ 115 అన్నది ఆదాయాల్లో మరింత పారదర్శకతకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల టెక్నాలజీ, రియల్‌ ఎస్టేట్, టెలికం వంటి రంగాల కంపెనీలపై ప్రభావం ఉంటుంది. 

మరిన్ని వార్తలు