మహిళల రక్షణకు ఎయిర్‌టెల్, ఎఫ్‌ఎల్‌వోల నుంచి యాప్‌

15 Apr, 2019 07:29 IST|Sakshi

న్యూఢిల్లీ: మై సర్కిల్‌ పేరుతో మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపకరించే యాప్‌ను భారతీ ఎయిర్‌టెల్, ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) విడుదల చేశాయి. కేవలం ఎయిర్‌టెల్‌ యూజర్లనే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ యాప్‌ సాయంతో తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లి ష్, హిందీ సహా 13 భాషల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్‌ఓఎస్‌ అలర్ట్స్‌ను పంపించొచ్చని విడుదలైన ప్రకటన తెలిపింది. తద్వారా తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమను చేరుకోవాలని సందేశాన్ని పంపొచ్చని పేర్కొంది. గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ ఐవోఎస్‌ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది.

>
మరిన్ని వార్తలు