ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు

14 Aug, 2019 19:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదున్నర ఏళ్లలో, అంటే 2025 సంవత్సరం నాటికి ఐటీ రంగంలో మరో 30 లక్షల కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయగా, ఏయే రంగాల్లో పెరుగుతాయో పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క నైపుణ్యం ఉన్న సాంకేతిక సిబ్బందే కాకాండా రెండు భాషలు, మూడు భాషలు వచ్చి, వాటిపై సరైన పట్టు ఉన్నవారికి కూడా ఉద్యోగాలు లభిస్తాయని, ఈ భాషా ప్రవీణుల్లో మహిళలే ఎక్కువ చేరే అవకాశం ఉందని భారత ఐటీ రంగానికి చెందిన ‘నాస్కామ్’ అధ్యక్షులు దేబ్జాని ఘోష్ చెప్పారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా విశ్లేషకులు, మొబైల్ టెక్, రోబోటిక్, వర్చువల్ రియాలిటీ, త్రీ డీ రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఉంటాయని ఘోష్ అంచనా వేస్తున్నారు. ఈ రంగాల్లో ఉద్యోగులు వివిధ పాత్రలు పోషించాల్సి ఉన్నందున, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులు అవసరం అవుతుందని ఆమె అన్నారు. అయితే ఈ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది ఉద్యోగులు అవసరం అవుతారని, అయితే నైపుణ్యం కలిగిన వారు అంతమంది అందుబాటులోని లేరని ప్రపంచ ఆర్థిక ఫోరమ్ అభిప్రాయపడింది. పది టెక్నాలజీ సంస్థల్లో 55 రకాల జాబులు నిర్వహించాల్సి ఉంటుందని, కొరతను ముందుగానే ఊహించిన భారత్, ఆ దిశగా కొత్త నైపుణ్యాభివద్ధికి కషి చేస్తోందని కూడా ఫోరమ్ ప్రశంసించింది. 

మరిన్ని వార్తలు