నోట్ల రద్దు... ప్రకంపనలు క్యాష్తో ముందే వేతనాలివ్వాలి!

15 Nov, 2016 01:22 IST|Sakshi
నోట్ల రద్దు... ప్రకంపనలు క్యాష్తో ముందే వేతనాలివ్వాలి!

ప్రభుత్వానికి పారిశ్రామిక, వాణిజ్య సంఘాల సూచనలు
నోట్ల రద్దుతో నష్టం జరగకుండా చూడాలని వినతి

న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో తక్షణం పడే ప్రభావంపై ఆందోళనతో ఉన్న వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారుు. కొత్త కరెన్సీ నోట్ల రూపంలో ముందస్తుగా వేతనాలు చెల్లించాలని, నగదు కొరతను నివారించేందుకు పదవీ విరమణ చేసిన బ్యాంకు ఉద్యోగుల సేవలను పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారుు. ఈ మేరకు పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఓ వినతిపత్రం సమర్పించారుు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు పాక్షికంగా లేదా పూర్తిగా వేతనాలను మందుగానే రూ.500 నోట్ల రూపంలో చెల్లించాలని కోరారుు.

దీనివల్ల బ్యాంకుల వద్ద క్యూలు తగ్గుతాయని, నగదు మార్చుకునే క్రమంలో ఉద్యోగుల గైర్హాజరు కారణంగా ఉత్పాదకత తగ్గకుండా చూడవచ్చని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. మరోవైపు అసోచామ్ సైతం ఈ విషయంలో ప్రధాని మోదీకి నేరుగా ఓ సూచన చేసింది. వేగంగా నగదు మార్పిడి, నగదు ఉపసంహరణ సాఫీగా జరిగేలా చూసేందుకు బ్యాంకులు రిటైర్డ్ ఉద్యోగులను భారీగా నియమించుకోవాలని అసోచామ్ సూచించింది. సాధారణ ఎన్నికల విధుల కోసం వివిధ శాఖల ఉద్యోగులను నియమించినట్టే ఇప్పుడు బ్యాంకుల్లోనూ వివిధ రకాల ఉద్యోగులను నియమించాలని కోరింది.

 25 శాతం పడిపోరుున వ్యాపారం
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశవ్యాప్తంగా వ్యాపారం 25 శాతం మేర తగ్గినట్టు ట్రేడర్ల సంఘం సీఏఐటీ పేర్కొంది. ఒకవైపు నగదు సరఫరా సాఫీగా కొనసాగేలా చూడడంతోపాటు ఎలక్ట్రానిక్ చెల్లింపులను పెంచే చర్యలను వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరింది.

మరిన్ని వార్తలు