టీవీఎస్‌ కొత్త స్కూటర్‌... ప్రత్యేకతలివే

5 Feb, 2018 17:17 IST|Sakshi

సాక్షి, ముంబై: ద్విచక్ర వాహన తయారీదారు టీవీఎస్‌ మోటారు కొత్త స్కూటర్‌ను లాంచ్‌​ చేసింది. టీవీఎస్‌ ఎన్‌ టాక్‌ పేరుతో తీసుకొచ్చిన ఫ్లాగ్‌షిప్‌ కొత్త స్పోర్టీ స్కూటర్‌ ధరను రూ. 58,750 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. ఇండియన్‌ స్కూటర్‌ మార్కెట్‌లో ఇదివరకెన్నడూలేని కొత్త ఫీచర్లను  జోడించి మరీ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. కొత్త ఇంజిన్‌, స్మార్ట్‌ఫీచర్లు, అత్యాధునిక సౌకర్యాలు, స్టయిలిష్‌ లుక్‌ దీని సొంతం. ముఖ్యంగా బ్లూటూత్‌ కనెక్టివిటీతో వస్తున్న మొట్టమొదటి స్కూటర్‌ ఇదే.

స్కూటర్‌ సెగ్మెంట్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీవీఎస్ అధునాతన 'స్మార్ట్జోనెక్ట్' టెక్నాలజీ ప్లాట్‌ఫాంతో దీన్ని రూపొందించినట్టు కంపెనీ ప్రకటించింది. 125 సీసీ ఇంజిన్ 9.4 పీఎస్‌ పవర్‌, 10.5ఎన్‌ ఎం టార్క్‌, బ్లూ టూత్‌ కనెక్టివిటీ  ప్రధాన పీచర్లుగా ఉన్నాయి. అంతేకాదు కాలర్ఐడీ, పార్కింగ్ లోకేషన్‌ అసిస్టెంట్‌, ఫుల్లీ-డిజిటల్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ద్వారా నావిగేషన్ సహాయాన్ని అందిస్తుంది. షార్ప్‌ హెడ్‌ లాంప్‌, డే టైం  రన్నింగ్‌ లైట్‌ లాంప్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ట్యాంప్‌, 12 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ లాంటి ఫీచర్లు, డ్యుయల్‌ టోన్ పెయింట్ పథకాలతో మొత్తం డిజైన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది.

ఇక పోటీపరంగా చూస్తే 2018 ఆటో షోలో లాంచ్‌ చేయనున్న హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్‌కి గట్టి పోటీ కానుంది.

మరిన్ని వార్తలు