టయోటా ఇటియోస్.. కొత్త వేరియంట్‌లు

10 Aug, 2015 23:52 IST|Sakshi
టయోటా ఇటియోస్.. కొత్త వేరియంట్‌లు

న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ ఇటియోస్ మోడల్‌లో అప్‌డేటెడ్ వేరియంట్, ఇటియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు పెట్రోల్ వేరియంట్ ధరలు  రూ.7.82 లక్షల నుంచి, డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.92 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ల నుంచి ప్రారంభమవుతాయని  కంపెనీ తెలిపింది. సౌకర్యవంతమైన ఫీచర్లతో ఈ కొత్త ఇటియోస్ ఎక్స్‌క్లూజివ్‌ను అందిస్తున్నామని కంపెనీ డెరైక్టర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) ఎన్. రాజా చెప్పారు. మారుతున్న జీవన శైలి, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పడు తమ మోడళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు