హోండా అమేజ్ లో కొత్త వేరియంట్

4 Mar, 2016 01:46 IST|Sakshi
హోండా అమేజ్ లో కొత్త వేరియంట్

ధర రూ.5.29 లక్షల నుంచి రూ.8.19 లక్షల రేంజ్‌లో
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా కంపెనీ కాంపాక్ట్ సెడాన్ అమేజ్‌లో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లో విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ కొత్త హోండా అమేజ్ కార్ల ధరలు రూ.5.29 లక్షల నుంచి రూ.8.19 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)రేంజ్‌లో ఉన్నాయని హోండా కార్స్ ఇండియా తెలిపింది. వాహన భద్రత అనేది తమకు అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశమని హోండా కార్స్ ఇండియా (హెచ్‌సీఐఎల్) ప్రెసిడెంట్, సీఈఓ కత్సుషి ఇనోయి చెప్పారు. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్‌తో ఈ అమేజ్ కొత్త వేరియంట్‌లను అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తామందించే ప్రతి హోండా వాహనంలో డ్యుయల్ ఎస్‌ఆర్‌ఎస్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉంటాయని వివరించారు.  హోండా అమేజ్‌ను 2013 ఏప్రిల్‌లో మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 2 లక్షల వాహనాలను విక్రయించామని వివరించారు. బ్లూ టూత్ ఎనేబుల్డ్ ఆడియో సిస్టమ్, ఆటోమేటిక్ సీ, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే తదితర ఫీచర్లు కొత్త అమేజ్ కార్లలో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు