భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు 

4 Feb, 2020 09:47 IST|Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ  మార్కెట్ల సానుకూల సంకేతాలతో వరుసగా రెండవ రోజు కూడా దేశీ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.  సెన్సెక్స్‌ ఏకంగా  547 పాయింట్లు ఎగిసి 40420 వద్ద, నిఫ్టీ 157 పాయింట్లు పుంజుకుని 11865 వద్ద  హుషారుగా కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్‌ 40వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 11 800 మార్క్‌ను అధిగమించింది. ఒక్క ఆటో తప్ప దాదాపు అన్ని రంగాలు లాభపడుతున్నాయి.  ఉత్పాదక కార్యకలాపాలు ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని తాకడంతో  ఆర్థిక పునరుద్ధరణపై పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను బలపడినట్టు ఎనలిస్టులు  భావిస్తున్నారు.  

హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రా టెక్‌ సిమెంట్‌, రిలయన్స్‌, హీరోమోటో,   ఐటీసీ, ఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌, టైటన్‌, ఐసీఐసీఐ  బ్యాంకు  లాభపడుతున్నాయి.  మరోవైపు బజాజ్‌ ఆటో, భారతి ఎయిర్టెల్‌, టాటా మోటార్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌   స్వల్పంగా నష్టపోతున్నాయి.  అటు కరెన్సీ రూపాయి కూడా పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతోంది. డాలరుమారకంలో 15  లాభపడి 71.21 వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు