దలాల్‌స్ట్రీట్‌ రికార్డ్‌: దీపావళి సంబరాలు

25 Jul, 2017 09:42 IST|Sakshi
దలాల్‌స్ట్రీట్‌ రికార్డ్‌: దీపావళి సంబరాలు

ముంబై:  దలాల్‌స్ట్రీట్‌  చరిత్ర సృష్టించింది. భారీలాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో నిఫ్టీ రికార్డ్‌ స్థాయిని నమోదు  చేసింది.   ఎంతో ఆస్తకిగా ఎదురు చూస్తున్న 10వేల మార్క్‌ మైల్‌ స్టోన్‌ ని నిఫ్టీ తాకింది.  ఆరంభంలో 10వేల మార్క్‌న్‌ టచ్‌ చేసి తద్వారా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న  చారిత్రిక గరిష్టం 10వేల మార్క్‌ను తాకింది.  అటు మరో  ప్రధాన  సూచీ సెన్సెక్స్‌ కూడా 32,374 వద్ద కొత్త గరిష్టాన్ని తాకింది.   ఎన్‌ఎస్ఈలో బ్యాంక్‌ నిఫ్టీ సైతం 24,625 పాయింట్ల వద్ద కొత్త  లాండ్‌మార్క్‌ను నమోదు  చేసింది. దీంతో దలాల్‌ స్ట్రీట్‌లో సంబరాలు మిన్నంటాయి. సందడి వాతావరణం నెలకొంది. బ్రోకరేజ్‌ సంస్థలు, ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకున్నారు.   

ప్రస్తుతం సెన్సెక్స్‌ 52 పాయింట్ల లాభంతో  32297 వద్ద, నిఫ్టీ పాయింట్లు 21 ఎగిసి వద్ద 9987 వద్ద కొనసాగుతోంది.  స్టాక్‌మార్కెట్‌ ప్రీ ఓపెన్‌ లో 10వేల మార్క్‌ను తాకిన నిఫ్టీ ఆస్థాయిని తాకినా, స్వల్పంగా  వెనక్కి తగ్గింది. బ్యాంక్‌ నిఫ్టీ  భారీగా పుంజుకోగా,  ఐటీ    స్వల్పంగా నష్టాల్లో కొనసాగుతోంది. ఐటీసీ, ఇన్‌ఫ్రాటెల్‌, ఐబీహౌసింగ్‌, అంబుజా, హీరోమోటో, వేదాంతా, ఏసీసీ, ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ లాభాల్లోనూ,  జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, లుపిన్‌, సిప్లా, విప్రో, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, సన్ ఫార్మా నష్టపోతున్నాయి. 

 
 

మరిన్ని వార్తలు