బ్యాంక్‌ నిఫ్టీ 2శాతం క్రాష్‌

29 May, 2020 10:17 IST|Sakshi

బ్యాంక్‌ షేర్లలో లాభాల స్వీకరణ

గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో 10శాతం ర్యాలీ చేసిన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతానికి పైగా నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 18,962.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఎఫ్‌అండ్‌ఓ ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో గత రెండు రోజులుగా భారీ లాభాలను ఆర్జించిన బ్యాంకింగ్‌ రంగ షేర్లు నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో ఇండెక్స్‌ 439 పాయింట్లను కోల్పోయి 18,729.90 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. 

ఉదయం 10గంటలకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు(19,169.80)తో పోలిస్తే 1.85శాతం(355 పాయింట్లు) 18,819.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా 4శాతం నష్టపోయింది. యాక్సిస్‌ బ్యాంక్‌ 3శాతం, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆర్‌బీఎల్‌ షేరు 1.50శాతం క్షీణించాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ షేర్లు 1శాతం పతనమగా, పంజాజ్‌ నేషనల్‌ బ్యాంక్‌ షేరు 0.10శాతం నష్టపోయింది. అయితే ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేరు మాత్రం 9.88శాతం లాభంతో రూ.22.25 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది.

మరిన్ని వార్తలు