రెండోరోజూ రాణిస్తున్న బ్యాంక్‌ నిప్టీ

28 May, 2020 10:44 IST|Sakshi

3శాతానికి పైగా లాభపడిన ఇండెక్స్‌

కలిసొస్తున్న షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు

అంతర్జాతీయ మార్కెట్లోనూ రాణిస్తున్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో వరుసగా రెండోరోజూ బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ జోరును కనబరుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ గురువారం ఉదయం ట్రేడింగ్‌లోనే 3శాతానికి పైగా లాభపడింది. నేడు డెరివేటివ్‌ కాంట్రాక్టులు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో ఎక్కువగా షార్ట్‌ కవరింగ్‌ చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ కూడా బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణిస్తుండటం కూడా  ఇన్వెస్టర్లకు ఈ షేర్ల కొనుగోళ్లపై ఆస్తకి చూపుతున్నారు. నిన్నటి ట్రేడింగ్‌లో ఇదే ఇండెక్స్‌ 6శాతం లాభంతో ముగిసిన సంగతి తెలిసిందే.

క్రితం రోజు భారీ లాభాల ముగింపు(18,710.55) కొనసాగింపుగా నేడు ఈ ఇండెక్స్‌ 1శాతం లాభంతో 18,924.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రైవేట్‌ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫలితంగా ఇండెక్స్‌ ఒక దశలో 3.17శాతం (593 పాయింట్లు) పెరిగి 19304.10 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.10:30నిల.కు ఇండెక్స్‌ 2.71శాతం లాభంతో 19,218.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండస్‌ బ్యాంక్‌ 6శాతం పెరిగింది. బంధన్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. ఆర్‌బీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 2శాతం ర్యాలీ చేశాయి. ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 1శాతం వరకు పెరిగాయి. ఒక్క పీఎన్‌బీ షేరు ఎలాంటి లాభనష్టాలను చవిచూడకుండా స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు