బ్యాంకింగ్‌ రంగ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు

1 Jun, 2020 10:22 IST|Sakshi

20వేల స్థాయికి చేరుకున్న బ్యాంక్‌ నిఫ్టీ

రాణిస్తున్న ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు

బ్యాంకింగ్‌ రంగ షేర్లకు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో భారీగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌ 4 శాతానికి(819 పాయింట్లు) పైగా లాభపడింది. మార్కెట్‌ భారీ లాభాల ప్రారంభంలో భాగంగా నేడు ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(19297.25)తో పోలిస్తే 2శాతానికి పైగా లాభంతో 19297 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

లాక్‌డౌన్‌ను విడతల వారీగా ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రకటనతో ఆర్థిక వ్యవస్థ పునఃప్రారంభం అవుతుందనే సానుకూల అంచనాలు బ్యాంకింగ్‌ రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లతో పాటు ‍ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో ఒక దశలో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 4.24శాతం 819 పాయింట్లు 20,117 లాభపడి వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు 4శాతం లాభంతో 20,078 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 6శాతం లాభపడింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ షేరు 5.50శాతం లాభపడింది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 5శాతం పెరిగింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం ర్యాలీ చేశాయి. కోటక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు