బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1200 పాయింట్ల జంప్‌ ..!

27 May, 2020 12:31 IST|Sakshi

బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీగా షార్ట్‌ కవరింగ్‌ 

అప్పర్‌ సర్కూ‍్యట్‌ వద్ద ఫ్రీజైన యాక్సిస్‌బ్యాంక్‌ 

ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం మిడ్‌సెషన్‌ సమయానికి 1200 పాయింట్లు లాభపడింది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లకు భారీగా లభించిన కొనుగోళ్ల మద్దతు ఇండెక్స్‌ ర్యాలీకి కారణమైంది. ఈ ఇండెక్స్‌ నిన్నటి ముగింపు(17,440.35)తో పోలిస్తే దాదాపు 1శాతం లాభంతో 17603.40 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రేపు (గురువారం) మే డెరివేటివ్స్‌ ముగింపు నేపథ్యంలో టేడర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌కు పాల్పడ్డారు. ఫలితంగా  మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు గణనీయమైన కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో ఇండెక్స్‌ 1200 పాయింట్లు(5.55 శాతం) లాభపడి 18640.65 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

మధ్యాహ్నం 2గంటలకు ఇండెక్స్‌ మునుపటి ముగింపుతో పోలిస్తే 5.5శాతం లాభంతో 18,407.80  వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా యాక్సిస్‌ బ్యాంక్‌ 10శాతం పెరిగి ఫ్రిజ్‌ అయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ 8శాతం లాభపడింది. బంధన్ బ్యాంక్‌,, కోటక్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్లు 5శాతం ర్యాలీ చేశాయి. ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 4శాతం లాభపడ్డాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం ర్యాలీ చేశాయి.

మరిన్ని వార్తలు