ట్రేడ్‌వార్‌ టెర్రర్‌: దలాల్‌స్ట్రీట్‌ బేజార్‌

23 Mar, 2018 09:26 IST|Sakshi

గ్లోబల్‌ సంకేతాలు, దేశీయ రాజకీయ అనిశ్చితి కారణాల  నేపథ్యంలో  దేశీయ స్టాక్‌మార్కెట్లు (గ్యాప్‌డౌన్‌) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.  ముఖ్యంగా  డోలాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌ చైనాపై  తొలి బాణం ఎక్కుపెట్టడం ఆందోళనకు దారితీసింది. చైనాపై  దిగుమతులపై విధించిన సుంకం  షాక్‌  గ్లోబల్‌ మార్కెట్లలో బ్లడ్‌బాత్‌కు దారితీసింది. ఇది మన ఈక్విటీ మార్కెట్లను కూడా తాకింది. దీంతో సెన్సెక్స్‌ 450, నిఫ్టీ 150 పాయింట్లు పతనమయ్యాయి.  ముఖ్యంగా నిఫ్టీ 10వేల కిందికి చేరింది.  అయితే స్వల్పంగా కోలుకుని 10వేల స్థాయిని నిలదొక్కుకుంటోంది.  దాదాపు అన్నిసెక్టార్లు నష్టాల్లోనే.  మెటల్‌, రియల్టీ, బ్యాంకింగ్‌, ఐటీ భారీగా నష్టపోతున్నాయి.

జేపీ అసోసియేట్స్‌, ఐవీఆర్‌సీఎల్‌, జూబ్లియంట్‌ ఫుడ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐడీబీఐ, యాక్సిస్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌,  ఇండియా బుల్స్‌, ఆర్‌కాం నష్టపోతుండగా ఐటీసీ, భారతి ఇన్‌ఫ్రాటెల్‌ లాభపడుతున్నాయి. గ్యాస్‌ ధర పెంపు వార్తలతో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు  హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ లాంటివి నష్టపోతున్నాయి.

ఇప్పటికే స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను ప్రకటించిన ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా చైనా దిగుమతులపై భారీగా సుంకాలను విధించేందుకు నిర్ణయించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరలేచింది. ఇది వాణిజ్య యుద్ధానికి దారితీస్తుందన్న అంచనాలు గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లలో భారీ అమ్మకాలకు కారణమైంది.
 

మరిన్ని వార్తలు