మార్కెట్లు : షార్ట్‌ కవరింగ్‌, ఊగిసలాట

9 Jul, 2019 14:41 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి. బడ్జెట్‌షాక్‌తో భారీగా నష్టపోయిన సూచీలు వరుగా మూడో రోజు కూడా నష్టాలతోనే ప్రారంభమైనాయి. ఆరంభంలో దాదాపు 200 పాయింట్లుపైగా నష్టపోయిన మార్కెట్లు కోలుకున్నప్పటికీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 7 వారాల తరువాత 11500 పాయింట్ల దిగువకు చేరింది.

ప్రస్తుతం సెన్సెక్స్‌ 34  పాయింట్లు క్షీణించి 38,686వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11538 వద్ద కొనసాగుతోంది. తద్వారా 11600 స్థాయికి దిగువనే కొనసాగుతోంది. మార్కెట్‌  హైస్థాయిల్లో  అమ్మకాల  ఒత్తిడి, షార్ట్‌ కవరింగ్‌కు దిగడం వంటి అంశాలు రికవరీకి వీలు కల్పించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  ప్రధానంగా ఫార్మా,  రియల్టీ,  పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్వల్పంగా లాభపడుతుండగా,  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ  స్వల్పంగా నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు