లాభాల స్వీకరణ, 9300 దిగువకు నిఫ్టీ

8 May, 2020 16:02 IST|Sakshi

ఫార్మా, రిలయన్స్ లాభాల అండ

9250 ఎగువకు నిఫ్టీ 

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో  స్వల్పలాభాలతో ముగిసాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఆరంభంలో 560 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్  చివర్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. దీంతో 199 పాయింట్ల లాభాలకు పరిమితమై 31642 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో  9251 వద్ద ముగిసింది.  ఫార్మ, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, ఐటీ, ఇన్ ఫ్రా షేర్లలో కొనుగోళ్లు కనిపించగా ఆటో, బ్యాంకింగ్ , మెటల్  ఫేర్లలో అమ్మకాలు కనిపించాయి.  (రిలయన్స్ దన్ను, భారీ లాభాలు)

ముఖ్యంగా ఆఖరి గంటలో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టీ 9300 దిగువకు  చేరింది. అయితే రిలయన్స్ లాభాలతో వారాంతంలో 9250 ఎగువన ముగిసింది.  డా.రెడ్డీస్  రికార్డు  హైకి చేరింది.  మరో మెగా డీల్ తో రిలయన్స్ 4 శాతం ఎగిసింది.   హెచ్‌యుఎల్  టాప్ విన్నర్ గా నిలిచింది.  ఇంకా టెక్ మహీంద్రా, నెస్లే , సన్ ఫార్మా  భారీ లాభాలను ఆర్జించగా,  ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ నఫ్టపోయాయి.  నిఫ్టీ బ్యాంకు  డే హై నుంచి 617 పాయింట్లు పతనమైంది. (అతి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు లాంచ్ )

చదవండి :  షావోమి ఎంఐ10 లాంచ్, ఫీచర్లు ఏంటంటే..

>
మరిన్ని వార్తలు