మెటల్ దెబ్బ: లాభాలనుంచి  మిశ్రమంగా

20 Apr, 2020 16:08 IST|Sakshi

ఆరంభ లాభాలనుంచి మిశ్రమంగా  ముగిసిన మార్కెట్లు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. భారీ లాభాలనుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు చివరకు  మిశ్రమంగా ముగిసాయి. సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుని 31648వద్ద ముగియగా, నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9261వద్ద ముగిసింది.  దాదాపు అన్ని రంగాల  షేర్లు స్తబ్దుగా ముగిసాయి. అయితే హెచ్డీఎఫ్ సీ, ఇన్ఫోసిస్ లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఐటీ, ప్రభుత్వ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు కనిపించగా, ఆటో ఎఫ్‌ఎంసిజి , మెటల్  రంగ షేర్లు  అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.  (భారీ లాభాలు, ఒత్తిడిలో సూచీలు)

టాటా మోటార్స్, సన్ ఫార్మ, ఎన్టీపీసీ, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, రిలయన్స్, ఐవోసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్ టాప్ విన్నర్స్ గా నిలిచాయి. హిందాల్కో, జెఎస్ డబ్ల్యూ స్టీల్, భారతి ఇన్ ఫ్రా టెల్, యాక్సిస్ బ్యాంకు,గ్రాసిం, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్, విప్రో, మారుతి సుజుకి, వేదాంతా, కోల్  ఇండియా నష్టపోయాయి. కానీ సెన్సెక్స్ వరుసగా మూడవ రోజు లాభాలతో ముగిసింది.
 

>
మరిన్ని వార్తలు