మూడో రోజూ భారీ నష్టాలు

10 Aug, 2017 17:49 IST|Sakshi
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.   ఆరంభం నుంచీ  నష్టాల్లోనే ట్రేడ్‌ అయిన మార్కెట్లు చివర్లో అమ్మకాలు మరింత ఊపందుకోవడంతో వరుసగా మూడో  రోజూ కూడా బలహీనంగా క్లోజ​ అయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 9,800 స్థాయిని సైతం కోల్పోయింది. చివరికి సెన్సెక్స్‌ 266 పాయింట్లు క్షీణించి 31,531 వద్ద, నిఫ్టీ  88 పాయింట్లు పతనమై 9,820 వద్ద  ముగిసింది.  అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత  వాతావరణం ఇన్వెస్టర్లను  ప్రభావితం చేసినట్టు నిపుణులు పేర్కొన్నారు.  
మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సు లతోపాటు,  రియల్టీలో లాభాల స్వీకరణతో  5 శాతం కుప్పకూలగా, ఆటో, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌ , మెటల్స్‌ ఇండెక్సులు  కూడా నష్టపోయాయి. ఐటీ రంగం మాత్రం స్వల్ప లాభాల్లో ముగియడం విశేషం. టాటా  8 శాతం  నష్టాలతో టాటా బిగ్‌ లూజర్‌గా నిలవగా,  డాక్టర్‌ రెడ్డీస్‌, బీవోబీ, గెయిల్‌, ఐషర్‌, సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, సిప్లా, ఏసీసీ నష్టాల్లోముగిశాయి. టెక్‌మహీంద్రా, అరబిందో, ఇన్ఫోసిస్‌, ఎల్‌అండ్‌టీ, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ బలపడ్డాయి.
 అటు డాలర్‌ మారకంలో రుపీ 0.18 పైసలు నష్టపోయి మళ్లీ 64 రూపాయల స్థాయికి చూరింది.  ఎంసీఎక్స్‌ మార్కెట్లో పుత్తడి లాభాలు కొనసాగాయి.  పదిగ్రా. రూ.174 లాభపడి రూ. 29,018 వద్దఉంది. 
 
మరిన్ని వార్తలు