మార్కెట్ల మహాపతనం : ట్రేడింగ్‌ నిలిపివేత

13 Mar, 2020 09:45 IST|Sakshi

ముంబై : స్టాక్‌మార్కెట్ మహాపతనం​ కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం నెలకొంటుందనే అంచనాతో అమెరికా మార్కెట్లు నష్టాల బాటపట్టడం, కరోనా భయాలు వెంటాడంతో  స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ ఆరంభంలోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 3090 పాయింట్లు పడిపోయి 29,687 పాయింట్లకు పతనమైంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 966 పాయింట్ల నష్టంతో 8624 పాయింట్లకు పతనమైంది. నిఫ్టీ 10 శాతం నష్టపోయింది. మదుపరులు అమ్మకాలకు తెగబడటంతో కీలక సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలు లోయర్‌సర్క్యూట్‌ను తాకడంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు.

చదవండి : మహమ్మారి ముంచేసింది!

>
మరిన్ని వార్తలు