గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఐబీ రియల్‌ఎస్టేట్‌ షేర్లు హై జంప్‌

27 May, 2020 12:56 IST|Sakshi

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌లోనూ నిర్మాణ రంగానికి పరిమితులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో భవన నిర్మాణ రంగ పనులు పుంజుకున్నాయి. దీంతో రియల్టీ షేర్లు జోరుగా ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యహ్నాం 12:40 గంటల ప్రాంతంలో నిఫ్టీ రియల్టీ 1.7 శాతం లాభంతో రూ.168.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఉదయం సెషన్‌లో నిఫ్టీ రియల్టీ రూ.166.40 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.168.90 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 6శాతం లాభపడి రూ.638.65 వద్ద, ఐబీ రియల్‌ఎస్టేట్‌ 5 శాతం లాభపడి రూ.45 వద్ద, ప్రెస్టేజ్‌ 4.3 శాతం లాభపడి రూ.142.90 వద్ద , ఒబేరాయ్‌ రియల్టీ 2.5 శాతం లాభపడి రూ.309.70 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.సోబా,మహీం‍ద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతుండగా, బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫోనిక్స్‌ లిమిటెడ్‌, సన్‌టెక్‌లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

>
Related Tweets
మరిన్ని వార్తలు