6రోజూ లాభాల ప్రారంభమే..!

3 Jun, 2020 09:35 IST|Sakshi

34వేల పైన మొదలైన సెన్సెక్స్‌ 

21వేల ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు

బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లకు భారీగా కోనుగోళ్ల మద్దతు

దేశీయ స్టాక్‌మార్కెట్లో కొనుగోళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. సూచీలు బుధవారం మళ్లీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మార్చి నెల తర్వాత తొలిసారి నిఫ్టీ ఇండెక్స్‌ నిఫ్టీ 10100వేల స్థాయిపైన 160 పాయింట్లు లాభంతో 10139 వద్ద మొదలైంది. సెన్సెక్స్‌ 529 పాయింట్లు పెరిగి 34355 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ర్యాలీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు పెరుగుతుండటం మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఆర్థిక, ప్రైవేట్‌ రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంక్‌ రం‍గ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో  ​ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్ నిప్టీ ఇండెక్స్‌ దాదాపు 3శాతం లాభంతో 21వేల పైన 21020 వద్ద ప్రారంభమైంది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.., నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు 1శాతం లాభంతో ముగిశాయి. పలుదేశాల ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలు ప్రకటిస్తున్న నేపథ్యంలో నేడు ఆసియాలోని ప్రధాన సూచీలు 1శాతం నుంచి 1.50మధ్య లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. పలు లాక్‌డౌన్‌ దేశాలు లాక్‌డౌన్‌ ఎత్తివేత నేపథ్యంలో క్రూడాయిల్‌ ఉత్పత్తి దేశాలు కోత విధించవచ్చనే ఆశాహన అంచనాలతో బ్రెంట్‌క్రూడాయిల్‌ ధర నేడు 3నెలల గరిష్ట స్థాయికి ఎగిసింది. 

నిఫ్టీ-50 సూచీలో... యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ఫిన్‌ సర్వీసెస్‌, బ్రిటానియా షేర్లు 4శాతం నుంచి 6.50శాతం లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, భారతీఎయిర్‌టెల్‌, హిందూస్థాన్‌యూనిలివర్‌, విప్రో 0.10శాతం నుంచి 0.50శాతం వరకు నష్టపోయాయి

మరిన్ని వార్తలు