మార్కెట్లో మరోసారి రికార్డుల మోత

18 Sep, 2017 16:01 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాల్లోముగిసాయి. అంతర్జాతీయ పరిణామాల ఊరట, దేశీయ ఐఐపీ గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం.. మన మార్కెట్లో నిష్టీ మరోసారి రికార్డుల మోత మోగించింది.  ముఖ్యంగా కీలక సూచీ నిఫ్టీ  మరోసారి సరికొత్త గరిష్టం వద్ద ముగిసింది.  దీంతో పాటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్  కూడా కొత్త గరిష్టాలకు చేరాయి.  సెన్సెక్స్‌ 151పాయింట్లు ఎగిసి 32, 423 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 10,153 వద్ద  క్లోజ్‌ అయింది.   ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్ట స్థాయిని.. క్లోజింగ్‌లో ఆల్‌టైం గరిష్ట స్థాయిని నిఫ్టీ నమోదు చేసింది.  10,172  నిఫ్టీ టచ్ చేసిన  నిఫ్టీ ఆల్‌టైం హై వద్ద ముగియడం విశేషం.  దీనికి  ఫార్మ, ఆటో లాభాలు మద్దతునిచ్చాయి.  

ఎంఅండ్‌ఎం,  బజాజ్‌ఆటో, హీరో మోటోకార్ప్‌ , భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఇండియా బుల్స్‌  బాగా    లాభపడ్డాయి.  వీటితోపాటు    ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,  యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ,   ఐసీఐసీఐ లాభాల్లో ముగిసాయి.  ఓఎన్‌జీసీ, టాటా స్టీల్, ఐటీసీ, అంబుజా సిమెంట్స్, టాటా పవర్ స్టాక్స్ నిఫ్టీ టాప్ లూజర్స్‌గా నిలిచాయి.
 

మరిన్ని వార్తలు