నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

25 Sep, 2018 09:37 IST|Sakshi

ముంబై : భారీ స్థాయిలో పతనమవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 14 పాయింట్లు, సెన్సెక్స్‌ 6 పాయింట్ల నష్టంలో ఎంట్రీ ఇచ్చాయి. ప్రస్తుతం నష్టాలు మరింత పెరిగి, సెన్సెక్స్‌ 88 పాయింట్ల నష్టంలో 36,216 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్ల నష్టంలో 10,932 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్‌ షేర్లు, ఆటోమొబైల్స్‌, మెటల్‌ స్టాక్స్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫార్మాస్యూటికల్స్‌ లాభాల్లో నడుస్తున్నాయి. ఐటీ ఫ్లాట్‌గా ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌లు టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. పవర్‌ గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌజింగ్‌,  బజాజ్‌ ఫైనాన్స్‌ ఎక్కువగా నష్టపోతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ ట్రేడింగ్‌ ప్రారంభంలో 26 పైసలు నష్టపోయి 72.89 వద్ద నమోదైంది. 

మరిన్ని వార్తలు