11ఏళ్ల తర్వాత నిఫ్టీకి ఇదే అత్యుత్తమ త్రైమాసికం..!

1 Jul, 2020 12:27 IST|Sakshi

3నెలల్లో 20శాతం లాభపడ్డ ఇండెక్స్‌ 

కోవిడ్‌-19 కేసుల పెరుగుదలకు బెదరని ఇన్వెస్టర్లు 

100శాతం లాభాల్ని ఇచ్చిన 16స్టాకులు

ప్రస్తుత ఆర్థిక సంవతర్సరపు తొలి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)నిన్నటి రోజుతో ముగిసింది. దాదాపు 11ఏళ్ల తర్వాత ఈ తొలి త్రైమాసికంలో నిఫ్టీ ఇండెక్స్‌ అతిపెద్ద ర్యాలీ చేసింది. ఈ 3నెలల కాలంలో ఈ ఇండెక్స్‌ 20శాతం ర్యాలీ చేసింది. అంతకు ముందు 2009 జూన్‌ క్వార్టర్‌లో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు 40శాతం లాభపడ్డాయి. 

కరోనా కేసులకు పెరిగినా... 

ఈ ఏడాది మార్చి 31న దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య 1,200గా నమోదైంది. సరిగ్గా 3నెలల్లో(జూన్‌ 30నాటికి)గా కేసుల సంఖ్య 5.66లక్షలకు చేరుకుంది. ఈ మార్చి 24 కంపెనీల నిఫ్టీ ఇండెక్స్‌ 7,500 వద్ద కనిష్టస్థాయిని తాకింది.ఊహించని రీతిలో పెరిగిన కరోనా కేసుల సంఖ్యకు ఇన్వెస్టర్లు ఏమాత్రం బెదరలేదు. కనిష్ట స్థాయిలకు పతనమైన వాల్యూ బైయింగ్‌ షేర్లకు కొనుగోళ్లు చూస్తూ ఇండెక్స్‌ల ర్యాలీకి తోడ్పడ్డారు. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 23ర్యాలీ చేసింది. అయితే స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 29శాతం జూన్‌ క్వార్టర్‌లో పెరిగింది.

రంగాల వారీగా చూస్తే అత్యధికంగా బీఎస్‌ఈలోని ఇంధన రంగ ఇండెక్స్‌ 45శాతం లాభపడింది. బీఎస్‌ఈ అటో ఇండెక్స్‌ 40శాతం పెరిగింది. హెల్త్‌కేర్‌, టెలికాం రంగాలకు చెందిన ఇండెక్స్‌లు 35శాతం ర్యాలీచేశాయి.  ఆయా దేశాల సెం‍ట్రల్‌ బ్యాంకులు వ్యవస్థలో లిక్విడిటీని జొప్పించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేశాయి. 

రెట్టింపు లాభాల్ని ఇచ్చిన 16 స్టాకులు:
ఈ క్రమంలో ఈ 3నెలల్లో బీఎస్‌ఈలో 16స్టాకులు ఇన్వెస్టర్లకు రెట్టింపు ఆదాయాల్ని ఇచ్చాయి. ఇందులో ఐడీబీఐ బ్యాంక్‌, ధనుకా అగ్రిటెక్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హాత్‌వే కేబుల్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, వోడాఫోన్‌ షేర్లు ఉన్నాయి. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో 100స్టాకులు పైగా షేర్లు 50శాతం లాభాల్ని ఇచ్చాయి. హిందూస్థాన్‌ కాపర్‌, డీసీఎం శ్రీరాం, హిందాల్కో, సిప్లా, ఎంఅండ్‌ఎం, అవంతీ ఫీడ్స్‌, అదానీ గ్యాస్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, స్పార్ప్‌, హీరో మోటోకార్ప్‌లు షేర్లు అందులో ఉన్నాయి. 

(రెట్టింపు లాభాల్ని ఇచ్చిన 16స్టాకులు జాబితా)

మరిన్ని వార్తలు