జూన్‌లో బాగుపడ్డ ‘సేవలు’: నికాయ్‌

5 Jul, 2018 00:59 IST|Sakshi

న్యూఢిల్లీ: సేవల రంగం జూన్‌లో తిరిగి వృద్ధిబాటలోకి ప్రవేశించింది. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ బిజినెస్‌ యాక్టివిటీ ఇండెక్స్‌ 52.6గా నమోదయ్యింది. మే నెలలో ఈ ఇండెక్స్‌ అసలు పెరక్కపోగా, క్షీణత (49.6) నమోదయిన సంగతి తెలిసిందే. నికాయ్‌ ఇండెక్స్‌ ప్రకారం, 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధిగా, ఆ దిగువన క్షీణతగా భావిస్తారు. జూన్‌లో నమోదయిన శాతం ఈ ఏడాదిలో ఇంతవరకూ నమోదుకాకపోవడం మరో విశేషం.  

తయారీ–సేవలు రెండూ చూస్తే... 
రెండు ప్రధాన విభాగాలైన తయారీ–సేవల రంగాలను చూస్తే, మే నెలలోలో నికాయ్‌ సూచీ 50.4 శాతం ఉన్న సూచీ జూన్‌లో 53.3కు పెరిగింది. 

మరిన్ని వార్తలు