ఈసారి మళ్లీ లాభాల్లోకి..

3 Oct, 2018 00:02 IST|Sakshi

నీరవ్‌ మోదీ స్కామ్‌ ఇక ముగిసిన అధ్యాయం

పీఎన్‌బీ ఎండీ సునీల్‌ మెహతా

తిరువనంతపురం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మళ్లీ లాభాల్లోకి మళ్లగలమని, వృద్ధి బాట పట్టగలమని ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) ఎండీ సునీల్‌ మెహతా ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంకును ముంచేసిన నీరవ్‌ మోదీ స్కామ్‌ ఇక ముగిసిన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు రూ.13,000 కోట్ల మోదీ స్కామ్‌తో కుదేలైన పీఎన్‌బీ .. ఇంకా ఆ ప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మెహతా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం రూ.12,282 కోట్ల నష్టం ప్రకటించిన పీఎన్‌బీ.. జూన్‌ క్వార్టర్‌లో మరో రూ.940 కోట్ల నష్టం నమోదు చేసింది. బాకీలు రాబట్టుకునేందుకు తీసుకుంటున్న వివిధ చర్యల ఊతంతో 2018–19లో బ్యాంకు మళ్లీ లాభాల్లోకి రాగలదని మెహతా చెప్పారు. పీఎన్‌బీ క్రమంగా వృద్ధి బాట పడుతోందని.. రుణ వృద్ధి ఊపందుకోవడంతో పాటు పరిశ్రమ సగటు స్థాయిని కూడా మించిందని ఆయన వివరించారు. వరద బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు రూ. 5 కోట్ల విరాళం అందించిన సందర్భంగా మెహతా ఈ విషయాలు తెలిపారు.  

కార్యకలాపాల విస్తరణ కోసం ప్రిఫరెన్షియల్‌ షేర్ల జారీ ద్వారా కేంద్రం నుంచి రూ. 5,431 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం ఇటీవలే ఇచ్చిన రూ. 2,816 కోట్లు.. మూలధనానికి సంబంధించి నియంత్రణ సంస్థల పరమైన నిబంధనల పాటింపునకు ఉద్దేశించినవని మెహతా చెప్పారు. మొత్తం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్‌ వ్యవస్థకు కేంద్రం అందించనున్న రూ.65,000 కోట్లలో పీఎన్‌బీకి రూ.8,247 కోట్లు లభించగలవని ఆయన వివరించారు. అక్టోబర్‌ 30న అసాధారణ సర్వసభ్య సమావేశంలో షేర్‌హోల్డర్ల నుంచి, ఆ తర్వాత నియంత్రణ సంస్థల నుంచి ఆమోదం లభించాక బ్యాంకుకు నిధులు అందనున్నాయని మెహతా పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది