మౌలిక రంగం వృద్ధి ఎలా..!

5 Sep, 2019 13:39 IST|Sakshi

మౌలిక రంగం ప్రతినిధులతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం సమావేశమయ్యారు. వృద్ధి, ఉపాధి కల్పన వంటి అంశాల్లో ఈ రంగానికి కీలక పాత్ర ఉన్న నేపథ్యంలో– ఆర్థికమంత్రి జరిపిన ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మౌలికరంగం పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికమంత్రి ఈ సమావేశంలో దృష్టి సారించినట్లు సమాచారం. ఆర్థిక మందగమనం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గత నెల నుంచీ ఆర్థికమంత్రి వివిధ వర్గాలతో సమావేశమవుతున్న సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్, ఫైనాన్స్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌సహా ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌ ఎన్‌ఎన్‌ సిన్హా, హెచ్‌సీసీ సీఎండీ అజిత్‌ గులాబ్‌చంద్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు