నిస్సాన్‌ మోటార్స్‌ ఛైర్మన్‌ అరెస్ట్‌

19 Nov, 2018 17:02 IST|Sakshi

నిస్సాన్ మోటార్స్‌  ఛైర్మన్ కార్లోస్ గోన్‌ (64)కు  భారీ ఎదురు దెబ్బ తగిలింది. వివిధ అవినీతి ఆరోపణల కింద విచారణాధికారులు గోన్‌ను  అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక వాణిజ్య చట్టం ఉల్లంఘనలు, ఎక్స్చేంజ్ చట్టం ఉల్లంఘనతదితర  ఆరోపణల నేపథ్యంలో టోక్యో ప్రాసిక్యూటర్స్‌ గోన్‌ను  అరెస్ట్‌ చేశారని రాయిటర్స్‌ నివేదించింది.

మరోవైపు గోన్‌తోపాటు, బోర్డు డైరెక్టర్ గ్రెగ్ కెల్లీలపై కంపెనీ ఆస్తుల దుర్వినియోగం, తదితర పలు ఆరోపణల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా విచారణ జరుగుతోందని జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్‌ ధృవీకరించింది. అంతర్గత దర్యాప్తులో  గోన్‌ నివేదించిన ఆదాయ వివరాలు అవాస్తవాలుగా తేలాయని తెలిపింది. దీంతో వీరిద్దరినీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌నుంచి తొలగించాల్సిందిగా సీఈవో హిరోటో సైకవా బోర్డును కోరనున్నారని తెలిపింది. ఈ వ్యవహారంపై  మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడిస్తామని  చెప్పింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో నిస్సాన్‌ , రెనాల్ట్‌ కౌంటర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు