భారీగా తగ్గిన నిస్సాన్ మైక్రా కార్ల ధరలు

17 Jun, 2016 15:44 IST|Sakshi
భారీగా తగ్గిన నిస్సాన్ మైక్రా కార్ల ధరలు

న్యూఢిల్లీ: జపనీస్ ఆటో దిగ్గజం నిస్సాన్ తమ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్ల ధరలు  గణనీయంగా తగ్గించింది. భారతదేశం లో విక్రయించే  మైక్రా ఆటో ట్రాన్స్మిషన్  రెండు  వేరియంట్ కార్ల ధరల్లో యాభైవేలకు పైగా కోత పెడుతున్నట్టు ప్రకటించింది.  
 
 మైక్రా సీవీటీ ఆటోమేటిక్ ఎక్స్ ఎల్  వేరియంట్ కార్ ను రూ 54, 252 లకు  తగ్గించింది. దీంతో గతంలో రూ 6,53,252కు లభ్యమయ్యే ఈ కారు ప్రస్తుతం రూ 5,99,000 కే  అందుబాటులో ఉంటుంది.
 మైక్రా ఆలోమేటిక్   సీవీటీ-ఎక్స్ వీ ని రూ రూ 45.713 మేర తగ్గించింది. దీంతో ఈ వెహికల్ ధర రూ 7,19,213 నుంచి కింది దిగి 6,73,500 దగ్గర లభ్యమవుతోంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలని నిస్సాన్ ప్రకటించింది.
 
దీనిపై  నిస్సాన్ మోటార్ వ్యాఖ్యానిస్తూ మెరుగైన స్థానికీకరణ నేపథ్యంలో  డెలివరీ పరంగా,  మంచి వేగవంతమైన, మరింత సమర్థవంతమైన మార్కెట్  సేవలు  అందించకలుగుతున్నామని పేర్కొంది.మైక్రా  ఉత్పత్తి ఇపుడు ఇండియాలోనే  సాధ్యమవుతోందని ,అందుకే తమ కస్టమర్ల సౌకర్యార్ధం   రివైజ్డ్ ధరలను అందుబాటులోకి తెచ్చామని నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు.  ఇక ముందు   పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్   మోడల్స్ లో మరింత  పోటీ  ధరలను ప్రవేశపెట్టనున్నామన్నారు.   ఏఆర్ఏఐ పరీక్షలు ప్రకారం తమ  మైక్రా  సీవీటీ  19.34 కెఎంపీల్  మైలేజ్ ఇస్తుందని పేర్కొన్నారు.

కాగా నిస్సాన్ మోడల్ మైక్రా ఉత్పత్తి రెనాల్ట్-నిస్సాన్  భాగస్వామ్యంలో  చెన్నై  ప్లాంట్లో  2010 లో  మొదలైన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు