నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్

7 Sep, 2016 00:54 IST|Sakshi
నిస్సాన్ మైక్రా.. ఆటోమేటిక్ వేరియంట్

ముంబై: నిస్సాన్ ఇండియా తాజాగా తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ ‘మైక్రా’లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. కొత్త ఇంటీరియర్స్‌తో కూడిన ఈ ఆటోమేటిక్ వేరియంట్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదని నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ అరుణ్ మల్హోత్రా తెలిపారు.

ఈ కొత్త వేరియంట్‌లో నిస్సాన్ ఎక్స్-ట్రానిక్ సీవీటీని అమర్చామని, ఇది మాన్యువల్ వేరియంట్ కన్నా అధిక మైలేజ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. కాగా నిస్సాన్ కంపెనీ ఈ మోడల్‌ను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. దేశం నుంచి ఎగుమతి అవుతోన్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో మైక్రాదే అగ్రస్థానం. ప్రస్తుతం మైక్రా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మార్కెట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.

మరిన్ని వార్తలు