ఉత్పత్తి నిలిపివేసిన నిస్సాన్‌

20 Oct, 2017 11:35 IST|Sakshi

 టోక్యో:  జపాన్‌కు చెందిన రెండవ అతిపెద్ద  ప్రముఖకార్ల ఉత్పత్తి సంస్థ నిస్సాన్‌ స్థానికంగా ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసింది. జపాన్‌లోని అన్ని ప్లాంట్లలోను ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టుగా గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.   డీలర్లకు రవాణా చేయకముందే దేశీయ విఫణికి ఉద్దేశించిన కొన్ని వాహనాలపై సరైన అధికారం లేకుండా తుది తనిఖీలను నిర్వహించారని సంస్థ ప్రకటించింది. ఉద్గారాల కుంభకోణంలో తనిఖీల సందర్బంగా చోటుచేసుకున్న అక్రమాలు సంస్థను చిక్కుల్లోకి నెట్టగా, తాజా పరిణామంతో నిస్సాన్‌ మరింత ఇబ్బందుల్లో పడింది.  

సంస్థకు చెందిన కొంతమంది అనధికారిక వ్యక్తుల ద్వారా అక్రమాలు జరిగాయని  అంగీకరించిన నిస్సాన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప‍్పటికే భారీగా వాహనాలను రీకాల్‌ చేసిన సంస్థ చివరకు తాత్కాలింగా ప్రొడక్షన్‌ బ్యాన్‌ విధించింది. ఈ సంక్షోభ  నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ,  జపాన్‌ లోని 6 ప్లాంట్లలో  అక్రమాలను  గుర్తించినట్టు తెలిపింది. ఇది చాలా క్లిష్టమైందనీ, దీనిపై అత్యవసర చర్యలు మాత్రమే సరిపోవని భావించామని తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత  చర్యల్ని తక్షణమే  తీసుకోనే యోచనలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ  ప్రకటించింది. సాధారణ కార్యక్రమాలలో భాగమైన పాత అలవాట్లు నిరోధించడానికి తాము కొత్త చర్యలు తీసుకోవలసి ఉందని నిస్సాన్ అధ్యక్షుడు హిరోతో సైకావా మీడియాకు చెప్పారు.  కానీ త్వరలోనే  ఉత్పత్తిని  పునరుద్ధరిస్తామని  వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు