దక్షిణాసియాలో అత్యుత్తమం..కృష్ణపట్నం పోర్టు

3 Jun, 2017 01:59 IST|Sakshi
దక్షిణాసియాలో అత్యుత్తమం..కృష్ణపట్నం పోర్టు

నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌
ముత్తుకూరు(సర్వేపల్లి): కృష్ణపట్నం పోర్టు దక్షిణాసియాలోనే అన్ని వసతుల కలిగిన అత్యుత్తమ పోర్టుగా రూపుదిద్దుకుంటోందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఆయన ఆటోమేటిక్‌ ఫర్టిలైజర్‌ హ్యాండ్లింగ్‌ సిస్టంను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక ఫర్టిలైజర్‌ హ్యాండ్లింగ్‌ సిస్టం ద్వారా ఎరువులకు నీమ్‌ కోటింగ్‌ ఇవ్వడంతో పాటు అత్యాధునిక ప్యాకింగ్‌ కల్పించడ వల్ల నాణ్యత దెబ్బతినదన్నారు. సరుకుల ఎగుమతి–దిగుమతుల్లో సమయ పాలన పాటిస్తున్నారన్నారు. పోర్టులో కస్టమ్స్‌ క్లియరెన్స్‌ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఫొటో ఎగ్జిబిషన్‌ ద్వారా ఎండీ చింతా శశిధర్, సీఈఓ అనీల్‌ఎండ్లూరి తదితరులు ఆయనకు పోర్టు ప్రగతిని వివరించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు