ఎన్‌ఎండీసీ షేర్ల బైబ్యాక్‌కు కేంద్రం ఓకే

9 Jan, 2019 01:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇనుప ఖనిజ మైనింగ్‌ కంపెనీ ఎన్‌ఎండీసీ.. రూ.1,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. ఆర్థిక  శాఖ  మంగళవారం దీనికి ఆమోదం తెలిపింది. బైబ్యాక్‌ విధి విధానాలు, తేదీలను ఎన్‌ఎండీసీ డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించనుంది. బైబ్యాక్‌ కారణంగా ఎన్‌ఎండీసీలో 72.43% వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుంది. డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్య సాధన కోసం షేర్లను బైబ్యాక్‌ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఒత్తిడిచేస్తోంది.

దీంట్లో భాగంగా ఇప్పటికే 9కు పైగా ప్రభుత్వ రంగ కంపెనీలు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించాయి. ఈ జాబితాలో ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, ఐఓసీ, ఎన్‌హెచ్‌పీసీ, భెల్, నాల్కో, కొచ్చిన్‌ షిప్‌యార్డ్, ఎన్‌ల్‌సీ, కేఐఓసీఎల్‌లు ఉన్నాయి. ఈ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.9,000 కోట్లు సమకూరుతాయని అంచనా. కాగా, బీఎస్‌ఈలో ఎన్‌ఎండీసీ షేర్‌ 0.1 శాతం తగ్గి రూ.95 వద్ద ముగిసింది.    

మరిన్ని వార్తలు