పసిడిపై భయం వద్దు

2 Dec, 2016 05:03 IST|Sakshi
పసిడిపై భయం వద్దు
  •  ఆభరణాల రూపంలో ఉంటే పరిమితులుండవు
  •  కడ్డీలు, బిస్కెట్ల రూపంలో ఉంటేనే పరిమితుల వర్తింపు
  •  వారసత్వ బంగారానికి బిల్లుల్లేవనే ఆందోళన అక్కర్లేదు
  •  ఐటీ చట్టంలో బంగారంపై ఎలాంటి కొత్త సవరణలూ లేవు
  •  ప్రస్తుత నిబంధనలే ఇక ముందూ అమలు..
  •  ‘సాక్షి’తో ఐటీ అధికారులు, కన్సల్టెంట్ల స్పష్టీకరణ
  • సాక్షి, బిజినెస్ విభాగం: రెండు రోజులుగా బంగారంపై పరిమితులకు సంబంధించి వదంతులు షికారు చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ గురువారం దీనిపై ప్రకటన చేశాక కూడా జనంలో ఇంకా కొన్ని సందేహాలు ఉండిపోయాయి. దీనికి తోడు బ్యాంకుల్లో ఉన్న లాకర్లకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సీల్ వేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. అహ్మదాబాద్‌లోని ఓ ఎస్‌బీఐ బ్రాంచిలో ఇలా సీల్ వేశారంటూ ఓ ఫోటో కూడా వాట్సప్‌లో షేర్ అవుతోంది. ఈ నేపథ్యంలో బంగారంపై వివిధ అంశాలకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ‘సాక్షి’ బిజినెస్ విభాగం పలువురు ఇన్‌కంట్యాక్స్ అధికారులు, కన్సల్టెంట్లను సంప్రదించింది.

    వారు చెప్పిన అంశాల సారాంశం ఒక్కటే. బంగారానికి సంబంధించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. బంగారాన్ని బిస్కెట్లు, కడ్డీల రూపంలో దాచుకున్న వారికి మాత్రమే పరిమితులు వర్తిస్తాయని, నగల రూపంలో ఉంచుకున్న వారికి ఎలాంటి పరిమితులూ వర్తించవని వారు స్పష్టంగా చెప్పారు. ఆ వివరాలివీ..
     
    లాకర్లకు సీల్ వేసేస్తారా?
    లాకర్లకు సీల్ వేసేస్తున్నారన్నది నిజం కాదు. నిజానికి సోషల్ మీడియాలో షేర్ అవుతున్న సీల్‌పై.. ఐటీ చట్టంలోని సెక్షన్-132 ప్రకారం లాకర్లకు సీల్ వేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ వాటిని ఆపరేట్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. అంటే.. ఆ సెక్షన్ ఇప్పటిది కాదు కదా.. ఎప్పటి నుంచో ఉన్నట్టేగా! ఆ ప్రక్రియ కూడా ఎప్పటి నుంచో చేస్తున్నదేగా! దీనిపై ఐటీ అధికారులు వివరణ ఇస్తూ.. ‘‘ఐటీ చట్టాన్ని ఉల్లంఘించారని సమాచారం వచ్చినపుడు, మా మార్గాల్లో మేం కనుక్కున్నపుడు పలువురి ఇళ్లలో సోదాలు చేస్తుంటాం.

    ఆ సోదాల్లో వారి బ్యాంకు లాకర్ల వివరాలు కూడా దొరుకుతాయి. వాటిని ఆయా వ్యక్తుల సమక్షంలోనే తెరిపిస్తాం. అందులో ఉన్న బంగారం, విలువైన వస్తువుల వంటివి ఖాతాల్లో చూపించినవైతే వదిలేస్తాం. లెక్కల్లో చూపించనివి ఉంటే.. తను వాటిని అంగీకరించకపోతే విషయం కోర్టుకు వెళుతుంది. వ్యవహారం కోర్టులో ఉన్నపుడు తదుపరి ఆపరేషన్లు చేయకుండా ఆయా లాకర్లకు సీల్ వేస్తాం. కోర్టు ఉత్తర్వులు వచ్చాక సీల్ తీసేస్తాం. ఇది ఎప్పటి నుంచో సహజంగా జరుగుతున్నదే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న నోటీసు అలాంటిదే. దానికి తాజా పరిణామాలతో ఎలాంటి సంబంధం లేదు..’’ అని వివరించారు.
     
    బంగారానికి పరిమితి ఉందా?
    వ్యవసాయంపై వచ్చిన ఆదాయంతో గానీ, పన్ను చెల్లించిన ఆదాయంతో గానీ కొనుక్కునే బంగారంపై ప్రస్తుతం ఎలాంటి పరిమితులూ లేవు. ఇక ముందు కూడా ఇవే కొనసాగుతారూ.10వేల కోసం వస్తే రూ.2 వేలే ఇచ్చారు
     ‘‘ఒకటో తారీకొచ్చింది. ఖర్చులు చాలా ఉన్నాయి. నా పింఛన్ రూ.15 వేలు బ్యాంకులో జమ అరూ.10వేల కోసం వస్తే రూ.2 వేలే ఇచ్చారు ఈ డబ్బుతో నా ఖర్చులన్నీ ఎలా తీరుతాయి..’’ంది. అందులోంచి రూ.10 వేలు తీసుకుందామనుకున్నా. కానీ సంగెం ఆంధ్రాబ్యాంకు వస్తే నగదు లేదని చెప్పి రూ.2 వేలే ఇచ్చారు. ఈ డబ్బుతో నా ఖర్చులన్నీ ఎలా తీరుతాయి..’’. కాకపోతే ఐటీ అధికారులు సోదాలు చేసినపుడు ఒక పరిమితికి మించి బంగారం ఉంటే వాటిని లెక్కల్లో చూపనివిగా పరిగణిస్తున్నారు. నగలకు సంబంధించి వివాహిత మహిళ దగ్గరైతే 500 గ్రాముల బంగారం, అవివాహిత మహిళ దగ్గరైతే 250 గ్రాముల బంగారం, మగవారి దగ్గరైతే 100 గ్రాముల బంగారం ఉండొచ్చు. ఎలాంటి బిల్లులూ లేకున్నా.. వారి ఆదాయానికీ, సదరు ఆస్తులకూ సంబంధం లేకున్నా వాటిని పట్టించుకోరు. ఈ విషయంపై రిటైర్డ్ ఐటీ అధికారి, ఐటీ కన్సల్టెంట్ శాంతకుమార్‌ను సంప్రదించగా.. ‘‘ఈ నిబంధనలన్నీ ఎప్పటి నుంచో ఉన్నారూ.10వేల కోసం వస్తే రూ.2 వేలే ఇచ్చారు

    ‘‘ఒకటో తారీకొచ్చింది. ఖర్చులు చాలా ఉన్నాయి. నా పింఛన్ రూ.15 వేలు బ్యాంకులో జమ అయింది. అందులోంచి రూ.10 వేలు తీసుకుందామనుకున్నా. కానీ సంగెం ఆంధ్రాబ్యాంకు వస్తే నగదు లేదని చెప్పి రూ.2 వేలే ఇచ్చారు. ఈ డబ్బుతో నా ఖర్చులన్నీ ఎలా తీరుతాయి..’’. బంగారానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎలాంటి నిబంధనలూ తేలేదు. పరిమితుల విషయానికొస్తే.. మీ దగ్గర ఉండే నగలు పూర్వీకుల నుంచి వచ్చినవో, మీరు కొనుక్కున్నవో అయి ఉంటాయి. వాటికి బిల్లులు కూడా పెద్దగా ఉండవని మాకు తెలుసు. అందుకని ఆభరణాల జోలికెపుడూ వెళ్లం. అదే బంగారం గనక బిస్కెట్లు, బార్‌ల రూపంలో ఉంటే దానికి పరిమితులు వర్తిస్తారుు. పరిమితి దాటితే బిల్లులు చూపించాల్సి ఉంటుంది. నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునే వారు ఎక్కువగా కడ్డీలు, బిస్కెట్లనే ఆశ్రరుుస్తుంటారు..’’ అని వివరించారు. దీన్నిబట్టి చెప్పాలంటే బంగారం ఆభరణాల రూపంలో ఉన్న వారికి ఎలాంటి భయమూ అక్కర్లేదని స్పష్టమవుతోంది.
     
     చట్టబద్ధంగా కొంటే ఎంత ఉన్నా ఓకే!
     బంగారంపై ఎలాంటి కొత్త పన్నును, పరిమితులను ప్రతిపాదించలేదని కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు   స్పష్టం చేశాయి. చట్టబద్ధంగా సమకూరినదైతే ఒక వ్యక్తి తన వద్ద ఎంత బంగారమైనా ఉంచుకోవచ్చని, దానిపై పరిమితులేమీ పెట్టబోవడం లేదని పేర్కొన్నాయి. ఈ మేరకు గురువారం ప్రకటనలు విడుదల చేశాయి. వ్యవసాయరంగం లాంటి మినహాయింపున్న రంగం నుంచి వచ్చిన ఆదాయంతో బంగారం కొన్నా కొత్త పన్నేమీ వేయరని స్పష్టం చేశాయి. ఆదా చేసిన డబ్బుతో కొన్నా ఇబ్బందేమీ లేదని.. అయితే ఆదా చేయగలిగేది ఎంత, కొన్నది ఎంతనే దానికి పొంతన ఉండాలని వివరించాయి.
         - సాక్షి నాలెడ్జ్ సెంటర్

మరిన్ని వార్తలు