రైల్వే శాఖ కీలక నిర్ణయం : ప్రయాణీకులకు షాక్‌

11 Aug, 2018 16:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేశాఖ ప్రయాణీకులకు భారీ షాక్‌ ఇచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి)  ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు  అందించే ఉచిత బీమా సౌకర్యాన్ని రద్దు చేసింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఉచిత బీమాను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది డిజిటల్ లావాదేవీలకు  ప్రోత్సహమిచ్చే చర్యల్లో  భాగంగా కేంద్రం  చేపట్టిన ఉచిత బీమా సౌకర్యాన్ని త్వరలో నిలిపివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.

రైల్వేలు సెప్టెంబర్ 1నుంచి ప్రయాణీకులకు ఉచితంగా ప్రయాణ బీమాను నిలిపివేయనుందనీ,  "బీమా ఐచ్ఛికం" అని సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు.  రైల్వే ప్రయాణికులు వెబ్ సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా టిక్కెట్లు బుకింగ్  చేసుకుంటే ఇన్సూరెన్స్‌ కావాలా వద్దా అనే రెండు ఆప్షన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. అయితే ఇన్సూరెన్స్‌కు ఎంత చెల్లించాలనేది మాత్రం  స్పష్టం చేయలేదు.

కాగా 2017,డిసెంబరు నుంచి ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సాహించేందుకు ఐఆర్సిటిసిద్వారా రైల్వేశాఖ ఈ ఉచిత బీమాను తీసుకొచ్చింది.  రైలు ప్రమాదాలు లేదా ఇతర సంఘటనల్లో గాయపడినవారు లేదా చనిపోయినవారి కుటుంబీకులకు పరిహారం అందిస్తారు. రైలు ప్రయాణం సమయంలో ఒక వ్యక్తి మరణించినప్పుడు గరిష్టంగా 10 లక్షల రూపాయలు, వికలాంగుడయితే 7.5 లక్షల రూపాయలు, గాయపడినట్లయితే  రూ. 2 లక్షలు అందిస్తోంది. అలాగే మృతదేహాలను తరలించేందుకు  రూ. 10వేలు కూడా అందిస్తుంది. కాగా ఉచిత బీమా సౌకర్యం వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరంలో బీమా కంపెనీల నుంచి రూ. 3.5 కోట్లు పంపిణీ చేసినట్టు ఇటీవల రైల్వే శాఖ వెల్లడించింది. 
 

మరిన్ని వార్తలు