ఇంటెల్ ఉద్యోగులకు భారత్ లో భరోసా

18 Apr, 2016 18:12 IST|Sakshi
ఇంటెల్ ఉద్యోగులకు భారత్ లో భరోసా

అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ సంస్థ భారత్‌లో ఉద్యోగాల కోత విధించే అవకాశం లేదని ఆ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు వెల్లడించారు. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గడంతో, ఈ ఏడాది చివరికల్లా 1100 మందికి పైగా ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్టు కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగుల కోత భారత్ లో ఉండే చాన్స్ లేదని, ఈ దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికే కంపెనీ కృషిచేస్తామని ప్రకటించారు.
 

కంపెనీ అభివృద్ధికి భారత్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ఇక్కడ ఉద్యోగుల కోత విధించబోరని ఇంటెల్ సంస్థ కన్సూమర్ టెక్నికల్ మార్కెటింగ్ డైరెక్టర్ థైన్ క్రిట్జ్ తెలిపారు. భారత్ లో రిటైలర్ల వ్యాపారం, అవకాశాలు పెరుగుతున్న క్రమంలో కంపెనీ భారత్ లో పెట్టుబడులే పెడుతుందని చెప్పారు.      

 

మరిన్ని వార్తలు