ఎన్నికలు : సోషల్‌ మీడియా ప్రకటనలపై కొరడా

21 Mar, 2019 14:59 IST|Sakshi

పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - ఈసీ

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్‌బమీడియా ప్లాట్‌ఫాంలు కీలక నిర్ణయం  తీసుకున్నాయి.ఎ న్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి తమ వేదికలపై  ఎలాంటి రాజకీయ ప్రచారం, ప్రకటనలు  చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పాయి. ఈ మేరకు   రూపొందించుకున​ స్వచ్ఛంద  నియమాలను ఎలక్షన్‌ కమిషనకు నివేదించాయి.  ముఖ్యంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్ట్రా, గూగుల్‌  షేర్‌ చాట్‌, టిక్‌ టాక్‌ ఇతర సంస్థల  ప్రతినిధులు ఈ నిబంధనల పత్రంపై సంతకాలు చేశాయి. 

ఐఏఎంఏఐతో మంగళవారం సమావేశమైన ప్రధాన సోషల్‌మీడియా వేదికలు తమకు  తాము రూపొందించిన మోరల్‌ ఎతిక్స్‌ కోడ్‌ను ఈసీకి సమర్పించాయి.  ఎన్నికల ప్రధాన అధికారి సునీల్‌ అరోరా మాట్లాడుతూ  ఆయా వేదికలు  కోడ్‌ సూత్రీకరణ చేయడం అవసరమైన, మంచి పరిణామమని వ్యాఖ్యానించారు.  ఇండస్ట్రీ బాడీ, ఇంటర్నెట్ అండ్‌  మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ( ఐఏఎంఏఐ) కమిషన్‌కు, సోషల్ మీడియా సంస్థలు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తుందన్నారు.   ఈ నైతిక నిబంధనల ఉల్లంఘనలపై  నోడల్ ఆఫీసర్  ఇది చట్టం ప్రకారం  కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

సిన్హా కమిటీ సిఫారసుల ప్రకారం ఆర్‌పీ 126 (రిప్రజెంటేషన్‌ అఫ్ పీపుల్) చట్టం, 1951 ప్రకారం నివేదించిన ఏదైనా ఉల్లంఘనలపై  మూడుగంటల్లోనే  పరిష్కరించడానికి తాము కట్టబడి ఉన్నామని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.  ఆన్‌లైన్‌ ప్రచారం కోసం ఇంటర్నెట్ ఆధారిత సంస్థలు స్వచ్ఛందంగా నిబంధనలను  రూపొందించుకోవడం  ఇదే మొదటిసారి.

కాగా ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి ప్రకారం,   పోలింగ్‌ తేదీకి  48 గంటల  ముందు రాజకీయ పార్టీల బహిరంగ ప్రచారంనిర్వహిచకూడదనే నిబంధన కొనసాగుతూ వస్తోంది. ఓటర్లు  స్వతంత్ర నిర్ణయంతో ఒటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగాఈ  సాంప్రదాయం అమలవుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు