బంగారం వెల్లడికి ఎటువంటి పథకం లేదు

1 Nov, 2019 00:05 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ: ప్రభుత్వం బంగారానికి సంబంధించి ఎటువంటి క్షమాభిక్ష పథకాన్ని పరిశీలించడం లేదని కేంద్ర అధికార వర్గాలు స్పష్టం చేశాయి. లెక్కలు చూపని బంగారాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఓ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని త్వరలో కేంద్రం తీసుకురానుందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిజానికి ఈ తరహా పథకం ఆదాయపన్ను శాఖ పరిశీలనలో లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. బడ్జెట్‌ ప్రక్రియ ఆరంభమైందని, ఈ ప్రక్రియకు ముందు ఈ తరహా వదంతులు రావడం సహజమేనని పేర్కొన్నాయి. ఓ పరిమితికి మించి లెక్కలు చూపని బంగారం కలిగి ఉన్న వారు స్వచ్ఛందంగా వెల్లడించి ప్రభుత్వం నిర్దేశించిన పన్ను చెల్లించేలా ఒక పథకం ప్రవేశపెట్టనున్నారని మీడియాలో కథనాలు రావడం గమనార్హం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు