ఐటీ రంగం పటిష్టంగానే...

17 May, 2017 01:20 IST|Sakshi
ఐటీ రంగం పటిష్టంగానే...

పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు
ఐటీ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌


న్యూఢిల్లీ: ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపుపై నెలకొన్న ఆందోళనను తొలగించే దిశగా కేంద్రం రంగంలోకి దిగింది. ఐటీ రంగం పటిష్టంగానే ఉందని, వాస్తవానికి సాదా సీదా సర్వీసుల నుంచి అత్యధిక నైపుణ్యం గల సేవలవైపు మళ్లుతోందని కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్‌ పేర్కొన్నారు. పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా కొందరు ఉద్యోగుల కాంట్రాక్టులను పునరుద్ధరించకపోవడం సాధారణంగా ఏటా జరిగేదేనని, ఈ ఏడాదీ అదే జరుగుతోంది తప్ప  అసాధారణ చర్యలేమీ తీసుకోవడం లేదని ఐటీ కంపెనీలు తనకు వివరించినట్లు ఆమె తెలిపారు. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌ తదితర ఐటీ దిగ్గజాలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయన్న ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు