రెడ్‌మికి సవాల్‌ : నోకియా స్మార్ట్‌ఫోన్లు

30 May, 2018 18:35 IST|Sakshi

నోకియా 2 (2018) : రూ.7,801

నోకియా 3(2018) : రూ. 10,900

నోకియా 5 (2018) : రూ.14,800

సాక్షి, న్యూఢిల్లీ: హెచ్‌ఎండీ గ్లోబల్  దిగువ, మధ్య తరగతి  సెగ్మెంట్‌లో మూడు కొత్త ఆండ్రాయిడ్‌  స్మార్ట్‌ఫోన్లను  ప్రకటించింది.  ముఖ్యంగా   దేశీయంగా ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను శాసిస్తున్న షావోమి షియోమీరెడ్‌మీ ఫోన్లకు పోటీగా  బడ‍్జెట్‌ ధరల్లో వీటిని అందుబాటులోకి తేనుంది.  గత ఏడాది లాంచ్‌ చేసిన నోకియా  2, 3. 5  సిరీస్లో 2018 మోడళ్లను  తీసుకొస్తోంది. నోకియా 2.1, నోకియా 3.1,  నోకియా 5.1  పేర్లతో ఈ  డివైస్‌లను విడుదల చేసింది. బ్లూ/కాపర్, బ్లూ/సిల్వర్, గ్రే/సిల్వర్ రంగు వేరియెంట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి.  నోకియా 2.1  సుమారు రూ.7,801గా ఉండనుందని అంచనా. జూలై నెలలో ఇవి వినియోగదారులకు లభ్యం కానున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నోకియా 2లో  జోడించింది.   మరోవైపు ఈ  మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలపై   అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా లేదు.

నోకియా 2.1 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే
1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
8 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్ఫీ కెమెరా
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా 3.1 ధర సుమారు రూ. 10,900గాఉండనుందని అంచనా. 2జీబీ/16జీబీ స్టోరేజ్‌,   3జీబీ/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో లభ్యం కానుంది.
నోకియా 3.1 ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
720x1440 రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2జీబీ/16జీబీ స్టోరేజ్‌
3జీబీ/32జీబీ స్టోరేజ్‌

128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
13ఎంపీ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
2990 ఎంఏహెచ్‌ బ్యాటరీ
నోకియా 5.1 కూడా రెండు వేరియంట్లలో( 2జీబీ/16జీబీ స్టోరేజ్‌,   3జీబీ/32జీబీ స్టోరేజ్‌) లభ్యం కానుంది. ధర  సుమారు రూ.14,800
నోకియా 5.1 ఫీచర్లు
5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే  
1080x2160  పిక్సెల్స్‌  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2జీబీ/3జీబీ
16జీబీ/32 జీబీ స్టోరేజ్‌
128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16ఎంపీ రియర్‌కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు