నోకియా మూడు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

9 Aug, 2018 19:22 IST|Sakshi

న‍‍్యూఢిల్లీ: నోకియా మూడు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. నోకియా 2.1, నోకియా 3.1(న్యూ వేరియంట్‌), నోకియా 5.1 పేరుతో మూడు డివైస్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆగస్టు 2 ఈవెంట్‌కు హెచ్‌ఎండీ గ్లోబల్‌ మీడియా ఆహ్వానం నోకియా 6పై అంచనాలు కొనసాగుతుండగానే నోకియా అనూహ‍్యంగా మూడు స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. పేటీఎం మాల్‌సహా ఇతర రీటైలర్స్‌తో పాటు ఆగస్టు 12 నుంచి ఇవి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో వస్తున్న ఈ డివైస్‌లోత్వరలోనే ఆండ్రాయి్‌ 9 పై తోఅప్‌గ్రేడ్‌ అవుతాయని కంపెనీ వాగ్దానం చేసింది. మోస్ట్‌ ప్రీమియం వెర్షన్‌గా నోకియా 5.1ను, ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో నోకియా 2.1 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అయితే నోకియా 3.1లో 3జీబీ వేరియంట్‌ను విడుదల చేసింది. ఫీచర్ల విషయానికి వస్తే డిజైన్, స్టోరేజ్‌, కెమెరా పరంగా వీటిని మెరుగు పరిచింది.

నోకియా 5.1 ఫీచర్లు, ధర
5.5ఫుడ్‌ హెచ్‌డీ డిస్‌ప్లే,18: 9  రేషియో
2160 x 1080 పిక్సల్స్ 
ఆక్టా-కోర్ మీడియా టెక్ హెల్లియో పి 18 ప్రాసెసర్‌
 3జీబీర్యామ్‌, 32 జీబీ  స్టోరేజ్‌ 
16ఎంపీ రియర్‌ కెమెరా
8ఎంపీ  సెల్ఫీ  కెమెరా 
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
రిటైల్ ధర రూ. 14,499

నోకియా 3.1 ఫీచర్లు, ధర
5.2-అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440 x 720 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
మీడియా టెక్ 6750 చిప్సెట్
3జీబీ ర్యామ్‌, 32 జీబీ  స్టోరేజ్‌ 
13 ఎంపీ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
2990 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
ధర: రూ. 11,999 

నోకియా 2.1 ఫీచర్లు, ధర
5.5-అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 425 చిప్‌సెట్‌ 
720x1280 
1జీబీ ర్యామ్‌
8 జీబీ స్టోరేజ్‌
8 మెగాపిక్సల్  రియర్‌ కెమెరా
5ఎంపీ సెల్పీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధర : రూ. 6999

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా