నోకియా 8 లాంచ్‌, ఫీచర్లు అదుర్స్‌

26 Sep, 2017 15:16 IST|Sakshi

నోకియా అభిమానులు ఎంతో కాలంగా వేచిచూస్తున్న తొలి హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లోకి వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను న్యూఢిల్లీ వేదికగా నేడు(మంగళవారం) భారత్‌లోకి లాంచ్‌ చేస్తున్నట్టు హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించింది. టాప్‌-ఎండ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ఎస్‌ఓసీ, వెనుకవైపు రెండు కెమెరాల సెటప్‌, ప్రీమియం యూనిబాడీ డిజైన్‌, బోతీస్‌ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 14 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఆన్‌లైన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో దీన్ని విక్రయించనున్నారు. అంతేకాక క్రోమా, రిలయన్స్‌, సంగీత మొబైల్స్‌, పూర్‌వికా, బిగ్‌ సీ వంటి ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కూడా ఇది అందుబాటులో ఉండనుంది. దీని ధర 32,999 రూపాయలు. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌తో వచ్చిన వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ ధర కూడా 32,999 రూపాయలే కావడం విశేషం.  నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి అదనంగా 100 జీబీ జియో డేటా అందించనున్నారు. అంటే రూ.309, ఆపై రీఛార్జ్‌లపై నెలకు 10జీబీ అదనపు డేటా చొప్పున 10 రీఛార్జ్‌లపై 2018 ఆగస్టు వరకు ఈ ఉచిత అదనపు డేటా ప్రయోజనాలు కస్టమర్లకు కంపెనీ ఆఫర్‌ చేయనుంది.  

నోకియా 8 ఫీచర్లు....
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
డ్యూయల్‌ సిమ్‌(నానో)
5.3 అంగుళాల క్యూహెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లే
2.5డీ కర్వ్‌డ్‌ కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌​ 835 ఎస్‌ఓసీ
4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
13 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు
13 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఒకేసారి ఫ్రంట్‌, బ్యాక్‌ కెమెరాలను వాడుతూ ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు(బోతీస్‌గా ఈ ఫీచర్‌ పేరు కూడా పెట్టింది)
4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ
3090ఎంఏహెచ్‌ నాన్‌-రిమూవబుల్‌ బ్యాటరీ

మరిన్ని వార్తలు