నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు లీక్‌

25 Dec, 2018 20:20 IST|Sakshi

‘పెంటా లెన్స్‌  (అయిదు కెమెరాలు)తో నోకియా 9'

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ  నోకియా తన హవాను చాటుకునేందుకు మరో  ఫ్లాగ్‌షిప్‌ కెమెరాతో సిద్ధమవుతోంది.  ఎప్పటినుంచో ఎదురు  చూస్తున్న  'నోకియా 9' స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్   2019లో విడుదల లాంచ్‌ చేయనుంది.  అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.  ఏకంగా 5   కెమెరాలతో ఇది వినియోగదారుల ముందుకు రానుంది.

తాజాగా సోషల్‌ మీడియా (ఇన్‌స్టాగ్రామ్‌) లో హల్‌ చల్‌ చేస్తున్న సమాచారం ప్రకారం  'నోకియా 9' స్మార్ట్‌ఫోన్‌  5 రియర్‌ కెమెరాలు, ఆండ్రాయిడ్ 9పై,   గ్లాస్‌ బ్యాక్‌తో ఈ ఫోన్ రానుంది.  మిగతా ఫీచర్లపై అంచనాలు  ఇలా ఉన్నాయి.

6 ఇంచ్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌
8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
4150 ఎంఏహెచ్ బ్యాటరీ

అయితే కెమెరా ఉత్పత్తిలో సమస్య కారణంగా ఇప్పటివరకూ ఫోన్ విడుదలను  వాయిదా వేస్తూ వచ్చిన సంస్థ కొత్త సంవత్సరంలో యూజర్లకు   కొత్త ఏడాది కానుకగా  2019 ఆరంభంలో తీసుకురానుంది.  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరపై సస్పెన్స్‌ వీడాలంటే  లాంచింగ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు