ఏడు కెమెరాలతో ప్రపంచంలో తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే!

1 Jan, 2019 11:23 IST|Sakshi

నోకియా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌

నోకియా 9 ప్యూర్‌ వ్యూ

ఏడు కెమెరాలతో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్‌ 

హెచ్‌ఎండీ గ్లోబల్‌ బ్రాండ్‌ కింద  తిరిగి స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా తాజాగా మరో ఘనతను చాటుకుంటోంది. ఏకంగా ఏడు కెమెరాలతో ఒక స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.  తాజగా లీకైన వీడియో అందించిన వివరాల ప్రకారం వెనుక 5 కెమెరాలు, ముందు రెండు కెమెరాలు మొత్తం7 కెమెరాలతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది.  దీంతో ఇది ప్రపంచంలోనే తొలి  డివైస్‌గా ఖ్యాతిని దక్కించుకోనుంది. నోకియా 9 ప్యూర్‌ వ్యూ  పేరుతో, ప్యూర్‌ డిస్‌ ప్లే ప్యానెల్‌తో తీసుకొస్తున్నఈ డివైస్‌ స్పెసిఫికేషన్లు విషయానికి వస్తే..

నోకియా 9 ప్యూర్‌ వ్యూ
5.9 అంగుళాల డిస్‌ప్లే 
ఆండ్రాయిడ్‌ 9.0 పై
క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 845 సాక్‌
6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌
8జీబీ ర్యామ్‌/256జీబీ స్టోరేజ్‌
ఫింగర్‌ ప్రింట్‌ డిస్‌ప్లే

మరిన్ని వార్తలు