ఆండ్రాయిడ్‌ పీ అప్‌డేట్‌తో నోకియా ఫోన్లు?

2 Jul, 2018 19:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: హెచ్‌ఎండీ గ్లోబల్‌  భాగస్వామ్యంతో మార్కెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన నోకియా స్మార్ట్‌ఫోన్లు మరో అడుగు ముందుకు వేశాయి. 2018 ఆగస్టునుంచి   లేటెస్ట్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేటెట్‌ వెర్షన్‌తో రిలీజ్‌ కానున్నాయని తెలుస్తోంది.   రాబోయే అన్ని నోకియా ఫోన్లు ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్‌ ‘పి’  తో రాబోతున్నాయని హెచ్‌ఎండీ గ్లోబల్‌ ప్రకటించినట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ అప్‌డేట్‌కు సంబంధించిన ఈ మెయిల్‌ సంభాషణ లీక్‌ అయింది. అలాగే నోకియా ప్రతినిధికూడా  అనధికారికంగా ఈ అప్‌డేట్‌ను దృవీకరించినట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు కొత్త ఆపరేటింగ్ సిస్టం గురించి ఎటువంటి సమాచారం లేకపోయినా ఆగస్టుమాసంలో ఆడ్రాయిడ్‌ పితో  రాబోతుందన్న  పుకార్లు  భారీగా షికారు చేస్తున్నాయి.  2017లో  నోకియా స్మార్ట్ ఫోన్లను తిరిగి మార్కెట్లో  ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో నోకియా 2, నోకియా 3, నోకియా 5 స్మార్ట్‌ఫోన్లను మార్కెట్ లో లాంచ్‌ చేసింది.

మరిన్ని వార్తలు